QR code
nagaraju's avatar

nagaraju

బాల్యం మనం నడచివఛ్ఛిన దారి.అది మరచి పోలేని దారి కూడా.బాల్యం లోకి తొంగిచూడడం,దానిని గురించి మాట్లాడడం అంటే జీవితపు పాదునీ,దాని మూలాలనూ మరొకసారి తడుముకోవడమే అవుతుంది.చిన్ననాటివి అక్షరాలా చెరగని గురుతులు. ప్రపంచంలోకి అడుగిడుతున్నప్పుడు మన తొలి ఉనికి,తల్లి ఒడిలోని చెరగని పాల గురుతులు,వేసిన తొలి అడుగులు,ఒకటి తరువాత ఒకటిగా మన ఉనికిలోనికి అనుసంధానమయ్యే అనుబంధాలు,నల్లని పలక మీద విచ్చుకునే తెల్లని తొలి అక్షరాల పులకరింత........వేసిన ప్రతి అడుగూ అద్భుతమని కాదు కానీ, తొలి నాళ్ళ పరిమళం సార్వజనీనం.అది ఒక్కోసారి సంచితమై ఉన్న అద్భుతాల హరివిల్లు.మరోసారి మనమూహించజాలని మహా సృజన. ఆ హరివిల్లులోనికి,సృజన లోకానికీ మనం అడుగిడితే.